Telangana : CM KCR Now On Facebook and Twitter Official



Telangana state chief minister K. Chandrashekar Rao now plans to reach masses through social media which is a very powerful medium these days. TRS chief ordered government officials to open an official facebook page with the name of CMO for the sake of promoting government schemes.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు మరింత చేరువ కావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. ఇందుకు సోషల్ మీడియాను ఆయన ఎంచుకున్నారు. విద్యార్ధులు, ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల సిబ్బంది విస్తృతంగా ఉపయోగించే ఫేస్‌బుక్‌లోకి ఆయన ప్రవేశిస్తున్నారు. తెలంగాణ సీఎంఓ పేరుతో అధికారిక అక్కౌంట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న అధికారిక సమీక్షలు, కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ సీఎం ఫేస్‌బుక్ లో పొందుపర్చుతారు. వీటితోపాటు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, కార్పొరేట్ రంగ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఫేస్‌బుక్ ద్వారా వారి సూచనలు, సలహాలను పోస్టు చేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సూచనలు, విమర్శలను తెలంగాణ సీఎంఓ ఫేస్‌బుక్‌లో ఉంచవచ్చు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఫేస్‌బుక్‌తో పాటు ట్విట్టర్ లోకి కూడా వస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎంఓ ఫేస్ బుక్‌ను ప్రభుత్వ ఐటీ శాఖ ఇప్పటికే ట్రయల్ రన్స్ ప్రారంభించింది. దీనిని ముఖ్యమంత్రి సోమ, మంగళవారాల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. పేస్ బుక్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా, వారికి ముఖ్యమంత్రే స్వయంగా సమాధానాలు కూడా ఇస్తారు. తెలంగాణ సీఎంఓ ఫేస్‌బుక్ నిర్వహణ సీఎంఓ కార్యాలయం ఆధీనంలోనే ఉంటుంది. సీఎం కేసీఆర్ ఫేస్‌బుక్ , ట్విట్టర్ లో అభిప్రాయాలను తెలిపేందుకు FaceBook లో లాగిన్ కావచ్చు. Twitter లో పోస్ట్ చేయవచ్చు.

Comments