Books and admissions free in Govt Jr colleges in Telangana

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతన్న విద్యార్థులకు శుభవార్త… ఇక వారిపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఆడ్మిషన్ ఫీజు, పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించనున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డును దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా తయారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు ఇస్తున్న విధంగానే ఉచిత విద్యను, ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిం చనున్నట్లుగా ఆయన ప్రకటించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయనున్నట్లుగా శ్రీహరి తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్మిడియట్ బోర్డు కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1.30లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లుగా ప్రాథమిక లెక్కలు ఉన్నాయని.. వారందరు ఇకపై ఆడ్మిషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. ఇప్పటి వరకు సైన్స్ గ్రూపు విద్యార్థులు రూ.893 , ఆర్ట్ గ్రూపునకు రూ.533 చెల్లిస్తున్నారు. ఇకపై ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. దీని వల్ల రూ.9 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేసినట్లుగా ఆయన తెలిపారు.
పేద విద్యార్థులు ఆడ్మిషన్ ఫీజు చెల్లించే ఆర్ధిక స్థోమత లేక కాలేజీల్లో చేరడంలేదని కడియం అన్నారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఈ ఫీజును ఫీజు రియంబర్స్‌మెంట్ ద్వారా విద్యా సంవత్సరం చివరల్లో చెల్లిస్తున్నారు. ఇకపై ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించరు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి తిరిగి ఇస్తారు. దీనితో పాటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివేవారికి ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తారు. జూలై నెలాఖరులోగా విద్యార్థులందరికీ ఉచితంగా పుస్త కాలను పంపిణీ చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పుస్తకాల పంపిణితో ఒక్కో విద్యార్థికి రూ.600 నుంచి రూ.750 వరకు ఊరట లభించనుంది. దీని వల్ల ప్రభుత్వం పై రూ.7కోట్ల భారం పడనుంది.
ఈ సంస్కరణలతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి ప్రతి జూనియర్ కాలేజీకి స్వంత భవనం ఉండే వి ధంగా ఇప్పటికే రూ.140 కోట్ల వరకు నిధులను మంజూరు చేశామన్నారు. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యుల రైజ్ చేసి మిగిలిన ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామ న్నారు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్‌కు, అధ్యాప కులకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించ డానికి మాడ్యుల్స్ తయారు చేస్తున్నామన్నారు.
జూలై 1 నుంచి ఆన్‌లైన్‌లో సేవలు
విద్యార్థులకు అందించే సేవలను ఇక ఆన్ లైన్ లో అందిస్తారు. www.tsbie.cgg.gov.in వెబ్ సైట్ లో ఇంటర్మిడియట్ కాలేజీల సమస్త సమా చారాన్ని పొందుపర్చారు. విద్యార్థులకు అవసర మైన ఎలిజిబిలిటి సర్టిఫికేట్, ఇక్వలెన్స్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, డూప్లికేట్ మార్కు మెమో, డూప్లికేట్ పాస్ సర్టిఫికేట్, త్రిపుల్ కేట్ సర్టిఫికేట్, హాజరు మినహియింపు సర్టఫికేట్, రీ కౌటింగ్ ఆఫ్ మార్స్, మీడియం చేంజ్ సర్టిఫికేట్ ఆన్ లై న్ లో దరఖాస్తు చేసుకుంటే అందిస్తారు. డెబిట్ కార్డు, క్రేడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చె ల్లింపులు చేయవచ్చు.
జూలై 1 నుంచి మొదలవు తాయి. కాలేజీ యాజమాన్యాలు కొత్త కాలేజీలకు అనుమతులు, గుర్తింపు రెన్యువల్, అదనపు సెక్ష న్ ల మంజూరు, కాలేజీల మార్పు, పేరుతో లాం టి సేవలను కూడా అందిస్తారు. విద్యార్థులకు తొందగా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఆన్ లైన్ లో విధానంలోకి తీసుకోచ్చామని కడియం శ్రీహరి తెలిపారు. దీని ద్వారా ఉద్యోగుల అవినీ తి కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర బోర్డు కా ర్యదర్శి ఆశోక్, ఇంటర్ బోర్డు న్యాయ సలహా దారు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకోచ్చిన సంస్కరణలను ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూ దన్ రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ గంటా జగన్మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments