Did You Know: Mouse Delays Emirates Flight


చిన్న చిట్టెలుక ఒక విమాన ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఎవ్వరికి చిక్కకుండా చుక్కలు చూపించింది. విమానంలోని క్యాబిన్ మొత్తం పరుగులు తీస్తూ అధికారులు, సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతే విమాన ప్రయాణం పూర్తిగా రద్దు చేశారు.

అధికారుల కథనం మేరకు - లండన్ లోని బర్మింగ్ హామ్ నుండి దుబాయ్ కి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ విమానం ప్రయాణించవలసి ఉంది. ప్రయాణికులు విమానంలో కుర్చున్నారు. పైలెట్ క్యాబిన్‌లోకి వెళ్లాడు. అయితే ఆ సందర్బంలో విమానంలో ఎలుక ఉందని గుర్తించారు.

ఎలుకను పట్టుకోవడానికి ప్రయ్నతించారు. ప్రయాణికులు అందరిని కిందకు దించేశారు. అయితే ఎలుకను పట్టుకోవడం వారి తరం కాలేదు. విమాన ప్రయాణం రద్దు చేశారు. ప్రయాణికులు అందరికి ఒక హోటల్ లో బస ఏర్పాటు చేశారు.

రాత్రి బర్మింగ్ హామ్ లోనే ప్రయాణికులు కునుకు తీశారు. మరుసటి రోజు ఎలుకను పట్టుకున్న తరువాత విమానం దుబాయ్ బయలుదేరింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నామని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ లోని ఖలీజ్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది.

Comments