Government plans for Any Time Liquor in Hyderabad





కొత్త ఎక్సైజ్ పాలసీపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. జూన్ మాసంతో ఎక్సైజ్ ఇయర్ ముగుస్తున్నందున  కొత్త పాలసీ కోసం ప్రభుత్వం  ప్రణాళికలను సిద్దం చేస్తోంది. వచ్చే వారానికి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గుడుంబాను అరికట్టేందుకు ఏం చేయాలనే దానిపై సర్కార్ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న గుడుంబాకు స్వల్పంగా ధరను పెంచి నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసే యోచనలో సర్కార్ ఉంది. రాష్ట్రంలో గుడుంబాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అనేక మంది గుడుంబా కారణంగా మృత్యువాత పడుతున్న విషయం సిఎం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో గుడుంబా నివారణకు ఏం చర్యలను తీసుకోవాలనే దానిపై నివేదిక ఇవ్వాలని సిఎం ఎక్సైజ్ శాఖను ఆదేశించారు.గుడుంబా నివారణను పూర్తిస్థాయిలో అరికట్టే పరిస్థితి ఎక్సైజ్ శాఖకు ఉంటుందా…..తదితర అంశాలపై సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేలకు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెలతో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న దుకాణాల కంటే మరికొన్ని దుకాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ విషయమై సర్కార్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 


గుడుంబా నివారణకు ఏం చేయాలనే దానిపై సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. గుడుంబా కారణంగా భవిష్యత్తులో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపైనే సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 60 రూపాయాలకు 180 ఎంఎల్ బాటిల్ చీప్ లిక్కర్ మార్కెట్ లో దొరుకుతోంది. గుడుంబా 20 రూపాయాలకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. అయితే గుడుంబాలో ప్రమాదకర రసాయనాల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో యుక్తవయస్సులోనే మహిళలు వితంతువులుగా మారడానికి గల కారణాలను ప్రభుత్వం విశ్లేషించింది. గుడుంబా కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని తేలింది. దరిమిలా గుడుంబా నివారణపై సర్కార్ దృష్టి కేంద్రీకరించింది.  ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరో వైపు 30 రూపాయాలకు చౌక మద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చే యోచనలో సర్కార్ ఉంది. వచ్చే వారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Comments