Mahindra to Introduce Android Auto in the XUV500 and Scorpio



మహీంద్రా ఈ సంవత్సరం జరిగిన గూగల్ I/O డెవలపర్స్ కన్ఫిరేన్స్ లో ఇండియాలో మొట్ట మొదటి ఆండ్రాయిడ్ ఆటోమేటిక్ కార్ ను తయారు చేయనుంది అని అనౌన్స్ చేసింది.

కొన్ని మార్పులు చేసి మహీంద్రా XUV 500 మరియు స్కార్పియో మోడల్స్ ను ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీ తో లాంచ్ చేస్తుంది మహీంద్రా. ఆండ్రాయిడ్ ఆటో టెక్నాలజీ ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ కు మీ కార్ సిస్టం ను అనుసంధానం చేసి ఎటువంటి ఇబ్బందులు రాని హాండ్స్ ఫ్రీ సర్విసస్ ను పొందగలరు., డ్రైవర్స్ కాలింగ్, మెసేజ్, మ్యాప్స్, మ్యూజిక్ మరియు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ను వాయిస్ కమేన్డ్స్ ను యూజ్ చేసే కొత్త యూజర్ ఇంటర్ఫేస్ గూగల్ నౌ ద్వారా ఏక్సిస్ చేయగలరు. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0 పై మాత్రమే పనిచేస్తుంది.

అయితే ఆపిల్ ఐ os కూడా కార్ ప్లే పేరుతొ ఇటువంటి టెక్నాలజీ ను అందుబాటులోకి తేవనుంది. ఆపిల్ సిరి పైన పనిచేయగా, ఆండ్రాయిడ్ గూగల్ నౌ పై పనిచేస్తుంది. ఇప్పటికే ఇండియన్ ఆటోమొబైల్ బ్రాండ్స్ సుజుకి, హోండా, హ్యుండై వంటివి ఆపిల్ ఫ్యూచర్ పార్టనర్స్ గా చర్చలు చేసుకున్నాయి. కాని ఆండ్రాయిడ్ ఆటో నిజానికి ఇండియన్ మార్కెట్ లో హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆపిల్ ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్ కి తన సర్విసస్ ను వాయిదా వేయటమే. అదీ కాక ఆపిల్ మ్యాప్స్ లో ఇండియన్ రోడ్స్ గూగల్ మ్యాప్స్ కన్నా చాలా తక్కువ డేటా ను కలిగి ఉంది. ఈ సంవత్సరం చివరిలో US మరియు యూరోప్ దేశాలలో ఆపిల్ కార్ ప్లే ను లాంచ్ చేస్తుంది.

ఇప్పటికే కొన్ని ఆటో కంపెనీలు తమ సొంత ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్స్ ను వాడుతున్నాయి. అయితే గూగల్ ఆండ్రాయిడ్ ఆటో కారణంగా అవి అన్ని ఒకే చోట అనుసంధానం అయ్యి ఎక్కువ ఆప్షన్స్ ను మరింత సులభంగా డ్రైవర్స్ కు అందిస్తుంది. వరల్డ్ లో హ్యుండై సొనాటా ఆండ్రాయిడ్ ఆటో ను వాడుతున్న మొదటి కార్, మరి ఇండియాలో ఈ టెక్నాలజీ ఎంత త్వరగా వాడుకులోకి రానుందో చూడాలి.

Comments