Phone conversation changed to State convention


ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిందని భావిస్తున్న ఆడియో టేపుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తన శాఖ అధికారులు, న్యాయనిపుణులతో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.

భేటీలో భాగంగా ఆడియో టేపుకు సంబంధించిన తదుపరి చర్యల పైన ఏకే ఖాన్ సమాలోచనలు చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ గొంతు ఎవరిదనేది తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియోను పంపించవచ్చునని తెలుస్తోంది.

నోటీసులు జారీ చేయవలసి వస్తే స్టీపెన్ సన్ చంద్రబాబులకు నోటీసులు జారీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. చంద్రబాబుకు నేడో, రేపో నోటీసులు జారీ అయ్యే అవకాశాలు లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్, నాయిని, సాక్షి, టీ న్యూస్‌లపై ఫిర్యాదులు, కేసు నమోదు:


చంద్రబాబు ఆడియో రికార్డులుగా చెబుతూ ఆదివారం రాత్రి విడుదలైన వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసీఆర్, జగన్, నాయిని నర్సింహా రెడ్డిల పైన ఫిర్యాదు చేస్తున్నారు. పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

విశాఖ త్రీటౌన్లో జగన్, కేసీఆర్, అలిపిరిలో కేసీఆర్, నాయిని పైన కేసు నమోదు చేసారు. మరికొన్ని చోట్ల కేసీఆర్, జగన్, టీ న్యూస్, సాక్షి ఛానళ్లు, స్టీపెన్ సన్ పైన కేసు నమోదు చేశారు.

చంద్రబాబును గొంతు అనుకరించారని, ఏపీ సీఎంను అప్రతిష్టపాలు చేసే కుట్ర చేశారని, ఫోన్ ట్యాపింగ్ చేసిన తెరాస ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 466, 469, 471, 120బీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Comments