FBI: ATMs across the globe face major threat of a cyber attack


ఇటీవలికాలంలో ATM మెషీన్లను  నేరస్తులు టార్గెట్గా చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. స్మిమ్మింగ్, ఇతర  పద్ధతుల ద్వారా భారీ మొత్తంలో ఎకౌంట్ల నుండి డబ్బులు దొంగిలిస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు అడపాదడపా జరిగే ఈ సంఘటనలు  రాబోయే కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన cashout అటాక్ మాదిరిగా నిర్వహించబడే ప్రమాదముందని తాజాగా FBI  హెచ్చరించింది.

ఒక మూకుమ్మడి దాడిలా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సైబర్ నేరస్తులు ATM మిషన్ల పై దాడి చేయబోతున్నారు.  ఖాతాదారుల అకౌంట్ల నుండి డబ్బులు ఖాళీ చేయబోతున్నారు అంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది.  దీని సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమకు లభించాయని ఈ సంస్థ తెలిపింది.

గత కొన్ని నెలలుగా USలోని  అనేక ఏటీఎంలు ఇలాంటి దాడులకు టార్గెట్ అయిన విషయం తెలిసిందే.  అలాగే 2016లో థాయిలాండ్ లోని గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంక్‌కి చెందిన  ఏటీఎం మిషన్లపై ఇదేమాదిరి దాడులు జరగడం పెద్ద మొత్తంలో డబ్బులు కస్టమర్ల అకౌంట్ల నుండి మాయం కావడం గమనార్హం. ఈ తరహా దాడులకు పాల్పడినప్పుడు హ్యాకర్లు,  రోజువారీ ట్రాన్సాక్షన్ లిమిట్ తొలగించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో ఒక బ్యాంకు కస్టమర్ ఎకౌంటు నుండి ఒకేసారి మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
కొద్దిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు తాము తీసుకుంటున్న సెక్యూరిటీ జాగ్రత్తలను  నిశితంగా సమీక్షించుకోవాలని FBI హెచ్చరిస్తోంది. ఇప్పటికే మన దేశంలో ఆర్థికపరమైన ఫ్రాడ్‌లు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా FBI హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మన బ్యాంకులు ఈ హెచ్చరికలు ఎంత సీరియస్‌గా  తీసుకుంటాయో వేచి చూడాలి.

Comments