ISRO : India soon launch a dedicated space and science television channel

ఎప్పుడో ఒకసారి అంతరిక్షం ప్రయోగాల కోసం ఇస్రో ప్రారంభించే కౌంట్ డౌన్ ల కోసం అందరూ ఆసక్తిగా చూస్తారు. ఇందుకుసంబంధించిన లైవ్ అప్డేట్స్ ఒక్క ప్రభుత్వ చానెల్స్ లో మాత్రమే లైవ్ ఇస్తారు. ప్రసార మాధ్యమాలు పెరుగుతున్న తరుణంలో ప్రయోగాల కోసం అప్డేట్ ను అంధించాలనే ఉద్దేశంతో ఇకనుంచి ఇస్రో కూడా ఓ చానెల్ ను ప్రారంభించనుంది. అంతరిక్షంలో జరిగే ప్రయోగాలను ఎప్పటికప్పుడు టీవీ ద్వారా అందించనుంది. రాకెట్ ప్రయోగాలు లాంటి ఎక్స్ క్లూజివ్ లైవ్ టెలీకాస్టింగ్స్ అందించనుంది ఇస్రో. దీనిపై సోమవారం (ఆగస్టు-13) మాట్లాడారు ఇస్రో అధికారులు. త్వరలో ఇస్రో టీవీ ప్రసారాలను చూడబోతున్నామని.. ఇస్రో వ్యవస్థాపకుడు విక్రం సారాభాయ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ చానెల్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

ఈ చానెల్ బహుభాషా ప్రేక్షకుల కోసం అంతరిక్ష పరిశోధనలపై, శాస్త్ర సాంకేతిక విషయాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఈ సంగతి వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి సారాభాయ్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భారత అంతరిక్ష రంగ పితామహునిగా మన్ననలు అందుకున్న విక్రం సారాభాయ్ 1919 ఆగస్టు 12న జన్మించారు. మా తొలి చైర్మన్, దార్శనికుడు సారాభాయ్ శతజయంతిని ఏడాది పొడవునా నిర్వహిస్తాం.. అని చెప్పారు డాక్టర్ కే శివన్. అంతర్జాతీయ అంతరిక్ష సమాఖ్య సహకారంతో 100 ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్పేస్ క్లబ్బులు, నాలెజ్ సెంటర్లు, టాక్ షోల వంటి ఎన్నో ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు వివరించారు.

Comments