JNU student Umar Khalid shot at in Delhi, escapes unhurt

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(JNU) స్టూడెంట్ ఉమర్ ఖలీద్ పై సోమవారం(ఆగస్టు-13) ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కానిస్ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా బయట ఖలీద్ పై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. ఈ కాల్పుల నుంచి సురక్షితంగా బయటపడ్డాడు ఖలీద్. యునైటెడ్ అగైన్‌స్ట్ హేట్ అనే సంస్థ నిర్వహించిన ఖౌఫ్ కే ఆజాది అనే ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు తామంతా ఖలీద్ తో వచ్చామని, తాము క్లబ్ బయట ఓ టీ స్టాల్ దగ్గర నిలబడి ఉన్న సమయంలో వైట్ షర్టు వేసుకొన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఖలీద్ పై కాల్పులు జరిపాడని ఖలీద్ స్నేహితులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని, తమ చేతికి చిక్కకుండా  నిందితుడు పారిపోయాడని తెలిపారు. అయితే పార్లమెంట్ సమీపంలోని కానిస్టిట్యూషన్ క్లబ్ దగ్గర హైసెక్యూరిటీ జోన్‌ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. ఈ దాడి తర్వాత ఖాలిద్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు ఖాలిద్. దేశంలో భయానక వాతావరణం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను బెదిరిస్తున్నారంటూ ఖలీద్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు

Comments