Pune co-op bank server hacked on Two Separate Days : Cyber attack


బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లోపాలను బట్టబయలు చేసే మరో సంఘటన తాజాగా పూణేలో చోటుచేసుకుంది.

పుణేలో మెయిన్ బ్రాంచ్ కలిగివున్న Cosmos బ్యాంక్‌కి సంబంధించి 94.42 కోట్ల రూపాయలను హ్యాకర్లు  దొంగతనం చేశారు. ఆగస్టు 11న ఈ సంఘటన జరిగింది. వీటిలో 78 కోట్లు మనదేశంలోని వివిధ లావాదేవీల క్రింద  ఇతర అకౌంట్లకు బదిలీ చేయబడ్డాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 2.5 కోట కోట్ల విలువైన లావాదేవీ ఒకటి  వీటిలో ఉండడం గమనార్హం. ఆగస్టు 13వ తేదీన, అంటే నిన్న మరోసారి సర్వర్ హ్యాక్ చెయ్యబఢి మరో 14 కోట్లు SWIFT లావాదేవీ ద్వారా హాంకాంగ్ లో ఉన్న Hang Seng బ్యాంక్‌లో  అకౌంట్ కలిగివున్న ALM ట్రేడింగ్ సంస్థకి పంపించబడింది.

ఈ ఫ్రాడ్  లావాదేవీలకు సంబంధించి ALM trading limited  సంస్థ మీద, అలాగే పూణేలో ఏయే అకౌంట్లలో అయితే డబ్బులు  డిపాజిట్ అయ్యాయో ఆయా అకౌంట్లు కలిగిన వ్యక్తుల పై Cosmos  బ్యాంకు కేసు నమోదు చేసింది. ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో  వినియోగదారులు తమ నగదును బ్యాంకుల్లో దాచుకుంటున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

అసలు బ్యాంకు సర్వర్లు  సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.  ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడంతోపాటు, పలు లేయర్లలో రక్షణ కల్పించడం, సైబర్ సెక్యూరిటీ రంగంలో నిష్ణాతులచే  ఎప్పటికప్పుడు లోపాలను గుర్తించే బగ్ బౌంటీ వంటి ప్రోగ్రాములు నిర్వహించడం క్రమం తప్పకుండా చేస్తే తప్పించి రోజురోజుకీ పెరుగుతున్న సెక్యూరిటీ పరమైన సవాళ్లను ఎదుర్కోవడం కష్టం.

Comments